Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics Inspirational

4  

Midhun babu

Classics Inspirational

వెలుగు సునామీ

వెలుగు సునామీ

1 min
3




మహిళా...!

నింగిని ఎగసే విజయకేతనానివి నువ్వే

ఆకాశమే నీ హద్దుగా

ఆలోచనాత్మకంగా పయనించు...


కుటుంబ క్షేమమే ధ్యేయంగా

నిరంతరం విశ్రమించని శ్రమదాతవు నువ్వే

వెలకట్టలేని మౌక్తికంలా ఆత్మవిశ్వాసంతో ప్రకాశించు...


హక్కుల కోసం ఆది నుంచి

ఇంటా బయటా పోరాడుతున్న ధీశాలివి నువ్వే

సమరధీరవై శంఖారావంతో ప్రభవించు...


పుట్టింటి అందమని మెట్టినింటి చందమని

అందలం ఎక్కించే ఈ లోకంలో

సత్యాన్వేషణ చేసేది నువ్వే

కార్యోన్ముఖ శక్తివై కర్తవ్య దీక్షతో ఉద్యమించు...


నువ్వో అపురూపమే, నువ్వో అనన్యమే 

అవకాశం ఎప్పుడూ నీ దగ్గరకు రాదు

అందిపుచ్చుకో యుక్తిమంతంగా ...


ఈ లోకంలో అడుగడుగునా

నీకు ఆంక్షల కంచెలే, అనుమానాల ఈటెలే

అచంచల విశ్వాసం తో అధిగమించు...


ప్రతి సూర్యోదయంలో నీకో పుట ఉందని

చరిత్ర గ్రంథంలో ఓ అధ్యాయం నీవని

నీ చరిత్ర నువ్వే గర్వంగా రాసుకో...


నీ విజయానికి ఈలోకం సమస్తం విస్మయపడేలా

ప్రతి నిముషం అప్రమత్తత పహారా కాస్తుంటే

వెలుగు సునామీలా విజృంభించు...!!



Rate this content
Log in

Similar telugu poem from Classics