ఊసులు
ఊసులు
నీ పరిచయమే ఓ పరవశం....!!
నీ స్నేహం ఓ సుందర స్వప్నం
నీ ప్రేమ ఓ మధుర జ్ఞాపకం
నీ తలపు తీయని మధుకలశం
నా కలలు కనే కళ్లు....!!
నిను చూడక కమ్మని కలలు కనలేవు
మాటలకందని భావాల
ఊసులు నీతో చెప్పలేవు
నిన్ను తలవని క్షణం అంటూ
ఒకటి ఉందంటే
అది నా మరణమే కదా.....!!

