ఊహలు...
ఊహలు...
నా గొంతు వినాలని కానీ
నన్ను చూడాలని కానీ
నాతో ఊసులాడాలని కానీ
నీకెప్పుడూ ఉండదేమో కానీ
నీ స్వరం వింటూవుండాలని
నిన్నే చూస్తూ వుండిపోవాలని
నీతో సమయం గడపాలని
తీగలా నిన్నల్లుకోవాలని
నీతో జతగా జాగారం చెయ్యాలని
నాకే ఎందుకిలా
పిచ్చి పిచ్చి ఊహలు
అందరాని ఆశలు
వీడిపోని మమతలు
ముడిపడిపోయాయి నీతో నా పంచప్రాణాలు...

