తీయనైన తెలుగు
తీయనైన తెలుగు
1.
తెలుగు నెపుడు మాటలాడుమా!తెనుంగు మాతృభాషగా
విలువ తెలిసి నేర్చుకోవయా!విమర్శ మాని బుద్ధిగా!
పలుకు పలుకులందు
దేనెలున్ బ్రమోదమిచ్చుచుండగా
గలికి తెలుగు కైతలన్నియున్ గలంబు బట్టి వ్రాయుమా!/
2.
వదల వలదు భాష నెన్నడున్ బరాయి భాష పైన గోర్కెతో
మొదలు నఱుకు చెట్టు చందమై భువిన్ దెనుంగు నాశమున్
వదరు పడుచు సల్పబోకుమా!స్వభాష యందు బ్రేమతో
బదము పదము పట్టి నేర్చినన్ బ్రకాశమౌగ తెల్గునున్ /
3.
మధురమయిన భాష యేదనన్ మనోహరమ్ము గాభువిన్
సుధలు చిలుకు భాష తెల్గురా సుగంధ
శోభితమ్ముగన్
నిధిగ నిలిచియుండు సంపదన్ నిరాదరంబు మానుచున్
విధిగ కొలిచి నేర్చుకొందమా విరాళిగా నుతించుచున్ /
---------------------
