STORYMIRROR

Ambica Lakshmi

Romance Classics Inspirational

4  

Ambica Lakshmi

Romance Classics Inspirational

తెలుసుకోవాలి

తెలుసుకోవాలి

1 min
688

పలకరించే పెదవులకు తెలుసు

ఎవరి నవ్వు ఎంత నిజమైనదో..


చూసే కళ్ళకి తెలుసు

ఎవరి చూపు ఎంత స్వచ్ఛమైనదో... 


వినే చెవులకు తెలుసు

ఎవరి పలుకులు ఎంత మధురమైనవో..


నడిచే కాళ్ళకి తెలుసు

ఎవరి నడవడిక ఎంత గొప్పదో...


నమస్కరించే చేతులకు తెలుసు

ఎవరి ప్రవర్తన ఎంత మెరుగైనదో..


ఆలోచించే మనసుకు తెలుసు

ఎవర్ని ఎక్కడ ఉంచాలో....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance