తెలిసేనా
తెలిసేనా
పుస్తకాలు తిను చెదలకు..చదువువిలువ తెలిసేనా..!
చెలిమినదిగ మిగులకున్న..బ్రతుకువిలువ తెలిసేనా..!
ఎవరి గొడవ ఏమైనా..మారేనా గొడుగులైన..
నీ నీడల నీడలలో..వెలుగువిలువ తెలిసేనా..!
విషపు చూపు కత్తులతో..గుండెనేల కోసేవో..
పసిపాపయె మనసుగాక..నవ్వువిలువ తెలిసేనా..!
పరిమళించు గాలి భాష..అనువదింప అవసరమా..
దాహార్తికి గాక అసలు..చినుకువిలువ తెలిసేనా..!
మెఱుపువీణ తోడు కదా..జన్మలుగా మౌనముగా..
కలల అడవి కాల్చకుండ..'నేను'విలువ తెలిసేనా..!