తాళి - భర్త
తాళి - భర్త


తాళి బంధంతో నా
వాడవైన నేస్తం
తెలుసుకొనుమా ఇది
నీవే నాకు సమస్తం
గుండెల్లో కొలువుండే దైవం
దింపకుమా ఎన్నటికీ గునపం
కళ్యాణ తిలకం దిద్దావు నొసట
కడదాకా తోడుండటమే బాసట
కరిగించకుమా కడగండ్లతో
కలిసే ఎదుర్కొందాము కష్టాల వడగండ్లనూ
కన్నీరన్నది కార్చనీయక ఎదలో
పన్నీరు నింపుమా ప్రియబాంధవా