స్థితప్రజ్ఞత
స్థితప్రజ్ఞత
గోడ నెక్కి కూచున్నది
గోడునంతా సూత్తున్నది
సంతసం ఇల్లంతా పూసినా....
మొగాన
సిగురంత నవ్వు లేకున్నది
గుండెలు మండిపోతున్నా
గుండ్రాయికి
గుబులుపట్టనట్లుంది.
రేబవళ్ళ బరువును
రెక్కలకు గట్టుకున్నా
అలుపు లేదన్నట్లు
అట్లనే ఉంది.
మడిసికో న్యాయం లేదంటూ
మనసు సెప్పిందే సేస్తుంది
బంధాలకంటక
బ్రతుకు నడిపే నేర్పును
మడిసికి
భగమంతుడల్లే సెబుతుంది.
.... సిరి ✍️❤️
