కన్నీళ్ళు
కన్నీళ్ళు
ఆ మబ్బులు కలిసి ప్రేమగా మురిసి ఒకరినొకరు హత్తుకుని విడిపోయేటప్పుడు కురిపించే చినుకులు కన్నీళ్ళు. ఈ వర్షపు ధారలు మబ్బుల కన్నీళ్ళు.
రాత్రంతా ఆ కుసుమాలను ముద్దాడి తెల్లవారగా తెల్లారిపోయిన తమ ప్రణయకథకు సాక్ష్యంగా ఆ చీకటి విడిచిన బిందువులు కన్నీళ్ళు.
ఈ నీహార బిందు సమూహాలు చీకటి కన్నీళ్ళు.
గుండె బండలలో ఊరి భావోద్వేగ ఏరులను తనలో కలుపుకుని బాధ బెంగ పాయలుగా విడిపోయి నయన కాసారాల నుంచీ స్రవించే జలపాతాలు కన్నీళ్ళు.
ఈ వెచ్చటి ఆశ్రుధారలు మనసు కన్నీళ్ళు.
ప్రకృతిలో ఇంధ్రధనువులూ, ఉషోదయాలు, పచ్చిక బయళ్ళకు, మనసులో ఉల్లాసం, ఆనందం, ప్రేమ, హర్షాతిరేకాలు దొరికిన గొప్ప స్థానం దొరకని ఏకాకి శోకసముద్రాలు కన్నీళ్ళు.
కురిసే వాన భూమిని బ్రతికిస్తే
కురిసే కన్నీరు జనతను బ్రతికిస్తుంది.
అందుకే పట్టరాని సంతోషమొచ్చినా, తట్టుకోలేకేని బెంగలు గుముగూడినా మొదటిగా బయట పడేవి కన్నీళ్ళకు విలువనివ్వాలి.
ప్రతి వర్షపు చినుకునూ ఒడిసిపట్టినట్టే, ప్రతీ కన్నీరుకీ సమాధానాలు వెదకాలి.
