సరాగాల కాపురం
సరాగాల కాపురం
సరాగాల కాపురం
(తేటగీతి మాలిక )
కలలు పండించు వేళలో కరిగి పోయి
తనువు మనసులు పులకించు తరుణమందు
సరస రాగాల ఝరులిట పొరలుచుండ
చిన్నదానిపై మరులుతో చెలువు మీర
సిగను ముడువంగ మల్లెల చెండు తెచ్చి
కురులు సవరించి భర్త తా మురిసిపోవ
పత్ని మగని ప్రేమను గాంచి పరవశించు
చక్కనౌ కాపురంబిట్లు సాగుచుండు.
కరము కరమును గలుపుచు కాలమందు
నడుచు చుందురు దంపతుల్ నమ్మకముగ
కష్టసుఖముల్ కలబోసి కలత పడక
నిబ్బరంబుగ బ్రతుకును నెట్టుచుంద్రు.
భారతీయత కున్నట్టి బలిమి చూచి
విశ్వమందున్న జనులెల్ల వింతయంద్రు
వేదకాలము నాటిదీ విభవమాహ!
కలిసి యున్నచో యీనాటి వలపు జంట
పొందు నదృష్ట సంపదల్ పుడమిపైన /

