స్నేహం అంటే... ఓ అదృశ్య ఆత్మబంధం! 🌌
స్నేహం అంటే... ఓ అదృశ్య ఆత్మబంధం! 🌌
మనుషులు రూపంతో కలిస్తే అది పరిచయం మాత్రమే...
కానీ, ఆలోచనలు ఆత్మతో కలిస్తేనే అది స్నేహం!
స్నేహం అంటే ప్రతిక్షణం మాట్లాడుకోవడం కాదు,
యుగాలు గడిచినా, మధ్యలో మౌనం నిండినా...
గుండెల్లో ఆత్మీయత కొంచెం కూడా తగ్గకపోవడం!
ఒకే రక్తంలో పుట్టకపోవచ్చు,
కానీ ఒకరి బాధ మరొకరి కంట్లో నీరై ప్రవహించేంత లోతైనది!
ప్రపంచమంతా మనల్ని తప్పుగా అర్థం చేసుకున్న వేళ,
"నేనున్నా నీకు... నీ నిజాయితీ నాకు తెలుసు" అంటూ
ప్రపంచాన్నే ఎదురించి నిలిచే నిఖారసైన నమ్మకమే స్నేహం!
కాలం మన దారులను వేరు చేయొచ్చు,
సమీకరణాలను మార్చేయొచ్చు...
కానీ, ఏ షరతులూ లేని ఆప్యాయతతో
చివరి శ్వాస వరకు తోడుండే ఒకే ఒక్క వెలుగు... స్నేహం!
జీవితం అనే అడవిలో తోవ తప్పిన ప్రతిసారి...
దిశ చూపించే దైవత్వం మన 'నేస్తం'!
