స్నేహమాధుర్యం
స్నేహమాధుర్యం
చేతికికట్టేటి తిమ్మిరిబిళ్ళ ఊరిస్తూవున్నదోయి,
పెదవులింట ఆ రుచులే కవ్విస్తూవున్నదోయి.
కొలువుతీరిన చెలిమికి
ముచ్చటే అదోయి,
తగువులాడు మనసులేదు
కాకెంగిలి కడుపు నింపెనోయి,
అసలు సుఖం చిరునామా
స్నేహపు ప్రేమలోనే దాగేనోయి,
పసిడి మూటలెన్నున్నా
బాల్య స్మృతులే భాగ్యమోయి.
నాన్న జేబులోని పైసలతో
తీయని రాగాలు పలికించే
తిమ్మిరి బిళ్ళోయి,
పప్పు డబ్బాలోని చిల్లరంతా
తిమ్మిరిబిళ్ళే దోచేనోయి,
పండగెలా వుంటుందని
తిమ్మిరిబిళ్ళను అడిగితే
స్నేహ మురిపాన్ని మించిన
పండుగ లేదనేనోయి,
అభిమానం పంచేటి
అందమైన ఆ నవ్వులే
హృదయపు కోవెలలో
సంతోష దీపాలోయి...