శాంతమోయి
శాంతమోయి
రాత్రితోటి ప్రేమలోన..మునిగిపోతే శాంతమోయి..!
తన కౌగిట పసిపాపగ..ఉండిపోతే శాంతమోయి..!
రంగులన్నీ ఏకమైన..'తెలుపు' గుట్టు దాచినదే..
కోకిలప్రియ రాగంలో..కరిగిపోతే శాంతమోయి..!
తాళలేని వాసనలే..సంకెళ్ళని తెలుపునదే..
నిదురపూల గంధాలే..రాల్చిపోతే శాంతమోయి..!
మదినిండిన చీకట్లను..పేల్చివేయు కోమలాంగి..
మోహవీణ తంత్రులనే..తెంచిపోతే శాంతమోయి..!
నీలిగగన తారలతో..తాండవించు జాణ తాను..
శోకాలకు సెలవివ్వగ..నవ్విపోతే శాంతమోయి..!
తప్పొప్పులు రద్దుచేసే..తత్వాలయ వాసినియే..
మదిమోసే బరువులెల్ల..కాల్చిపోతే శాంతమోయి..
