STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఏనాటికైనా గెలుపు నీదే

ఏనాటికైనా గెలుపు నీదే

1 min
4

ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే
పట్టువదలక గుండె దిటవుగా
సాగిపోరా ముందుకు
ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే
ఓటమన్నది గెలుపు బాటకు
పాఠమదియని తెలుసుకోరా

ఆకురాలు కాలమొచ్చినా
చెట్టు మోడుగా మారదా
ఋతువు మారి వసంత వేళన
తిరిగి చివురులు ఎత్తదా
గెలుపు ఓటమి సహజమేనని
ప్రకృతి ధర్మం తెలుపదా
ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే

కారు మబ్బులు చుట్టూ ముట్టినా
కాంతి కిరణం ఆగునా
మబ్బు తెరలను చీల్చుకుంటూ
ధరణి వైపు సాగదా
నేలను ముద్దాడినంతనే
వెలుతురై వికసించదా
ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే

తల్లి ఒడి దిగి పసిపాపడు
తడబడు అడుగులు వేయడా
ఎన్నిమార్లో పడుతూ తూలుతూ
పరుగులెత్తగ నేర్వడా
ఓటమన్నది గెలుపు బాటకు
గుణపాఠమన్నది తెలుసుకోరా
ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే

చరిత్రలో ఘన కీర్తి గాంచిన
మహానీయులు ఎందరో
ఓటమన్నది ఎరుగకుండా
సాధించినారా ఏదైనా
ఓటమికి ఎదురీదకుండా
గెలుపు తీరం దొరకదు
పట్టువదలక ముందుకెళితే
గెలుపు అన్నది తథ్యము
ఓడిపోతే చిన్నబోకు
ఏనాటికైనా గెలుపు నీదే


Rate this content
Log in

Similar telugu poem from Classics