STORYMIRROR

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

సామాజిక నిర్లక్ష్యం

సామాజిక నిర్లక్ష్యం

1 min
397


ఓ సమాజమా!


నీ నిర్లక్ష్యపు వాకిటిలో

యువత మత్తులో మునిగింది

భవిష్యత్తు అగమ్యగోచరమయింది

సాంప్రదాయమెప్పుడో నాశనమయింది

సంస్కృతీ వైభవం మసకబారింది

చేరదీసి చైతన్యమును నింపుమా!


పరాయిభాష రాజ్యమేలుతున్నది

మాతృభాష వసివాడి వాలిపోయింది

నీరశించి మరణానికి చేరువయింది

ప్రాణముపోసి' తెల్గు పలుకును 'నిల్పుమా!


ప్రకృతి వనరులు తగలబడ్డాయి

ప్లాస్టిక్కుతో విషతుల్యమయ్యాయి

ప్రళయాలే ముంచుకొస్తున్నాయి

పలురకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి

కాలుష్యభూతాన్ని కాల్చివేయుమా!


కుటుంబ బంధాలు విచ్ఛిన్నమయ్యాయి

కూళల సమూహాలు రాజ్యమేలుతున్నాయి

ప్రజల ప్రాణాలు గాలిలో నిలిచాయి

భద్రతలేక బరువుగా సాగుతున్నాయి

జనులకు భవ్యమైన బ్రతుకునొసగుమా!


నిమ్మకునీరెత్తినట్లు చరించకుమా!

మేలుకొమ్ము!ప్రజలకొఱకు 

మొద్దు నిదురను వదిలించుకొనుమా!

జాతికి వెలుగును పంచుమా!

ఓ సమాజమా!మేలుకొమ్ము!





Rate this content
Log in

Similar telugu poem from Inspirational