STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

రక్త బంధమా? పరాయి బంధమా...???

రక్త బంధమా? పరాయి బంధమా...???

1 min
1



బంధాలన్నీ బతికే ఉన్నాయి
బంధుత్వమే చనిపోయిందే 
ఇంటి నిండా మనుషులు ఉన్నా
మనసు మాత్రం ఒంటరైపోయిందే 

అవసరం అంతవరకే అడుగులు వస్తాయి
అవసరం తీరగానే దారులు మారిపోతాయే 
కన్నీటి విలువ తెలియని లోకంలో
కలిసిన రక్తం కూడా పరాయైపోతుందే 
ఒకప్పుడు గుమ్మం నిండా నవ్వులు ఉండేవి
ఒకరి బాధని అందరూ పంచుకునేవారు 
ఇప్పుడు నవ్వులు ఫోటోలలో మిగిలిపోయాయి
మనుషులు మాత్రం నటనలో మునిగిపోయారు 
చేతివేళ్లు వేరైనా కలిసే ఉంటాయి
బంధాలు కూడానే అనుకున్నాను 
కాలం కాదు అవసరమే మనుషుల్ని మార్చేస్తుందని
చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను 

డబ్బు ముందు ప్రేమ ఓడిపోయిందే 
హోదా ముందు ఆప్యాయత తలవంచిందే 
మనిషిని కాదు అతని పరిస్థితిని
ప్రేమించే రోజులు వచ్చాయే
నీడలా వెంట ఉంటామన్నవాళ్ళు
ఎండొచ్చేసరికి కనిపించరే 
నువ్వు గెలిస్తే చప్పట్లు కొట్టే మనవాళ్ళు
పడిపోతే చేతులు అందించరే 

చెట్టుకి పండు ఉన్నంతవరకే రాళ్లు పడతాయి
మనిషికి ఉపయోగం ఉన్నంతవరకే పలకరింపులు వస్తాయి 
గాయం చేసిన వాళ్ళు పరాయి వాళ్ళు కాదు
మనవాళ్ళని నమ్మిన వాళ్లే 
కన్నీళ్లు కళ్ళలో నుంచి రావు
నమ్మకం చనిపోయిన చోట నుంచి వస్తాయి 
హయ్ కాలం నేర్పిన గొప్ప పాఠం ఒక్కటే
అందరూ మనవాళ్ళు కావచ్చు కానీ 
అందరికీ మనం మనవాళ్ళం కాదు 
బంధుత్వం రక్తంతో పుడుతుంది
కానీ ప్రేమతోనే బతుకుతుంది 
ప్రేమ చనిపోయిన చోట
బంధాలు కూడా శవాలే ‌‌...!!!


Rate this content
Log in

Similar telugu poem from Classics