STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ముసుగు మనుషులు

ముసుగు మనుషులు

1 min
2




పాము విషం మించిన... ముసుగు మనుషులున్నారూరా! 
ముందు మంచి మాటలు చెప్పి... వెనక గొంతులు కోస్తారు!
ఈ జనం లోపల చాలా... మంది ఉంటారు చూడు 
పగ పెట్టి నవ్వుతారు... వెనకాల పోట్లు పొడుస్తారు 

అవసరం ఉన్నప్పుడు కాళ్ళు... మొట్టుకుంటారు 
తీరా పని అయిపోతే... నిన్ను రోడ్డున పడేస్తారు! 
నోట్లో నాలుక లేదు... అన్నట్టు నటిస్తారు 
సమయం దొరికిందా... నీ కొంపనే ముంచుతారు 
అబ్బబ్బా నువ్వే... నా దేవుడంటారు 
నిలువునా నిన్ను... నిలువు దోపిడీ చేస్తారు! 

కంటికి కనబడని విషం... కక్కేటి నాగులు
మాటల గారడీతో... ఏమార్చేటి మాయగాళ్ళు! 
ఎదురుగా ఉంటేనేమో... భజనలు చేసేటోళ్ళు
కంటికి కనిపించకుండా... వెన్నుపోటు పొడిచేటోళ్ళు!
మంచితనమనే... ముసుగు వేసుకున్న రాక్షసులు 
లోకంలో ఉన్నారే... ఇలాంటి నీచపు మనుషులు!

రాతి గుండెలు వీరికి... మమత అంటే ఏంటో తెలీదు 
ఎదుటివాడి బాధ చూస్తే... కళ్ళు కూడా తెరవరు!
స్వార్థమే ఊపిరిగా బతికే... ఈ దుర్మార్గులు 
సచ్చినా సరే వీళ్ళ కంటూ... కన్నీరు పెట్టేటోళ్ళు ఉండరు! 
నమ్మకద్రోహమే... వీరి నిత్యకృత్యం 
ఇలాంటివాళ్ళతో స్నేహం... అంటే అది ఒక శూన్యం! 

అందుకేరా... తమ్ముడా... చూసి నమ్మి బతకాలి 
నవ్వు వెనుక ఉన్న విషాన్ని... నువ్వు గుర్తుపట్టాలి! 


Rate this content
Log in

Similar telugu poem from Classics