మనోహరు
మనోహరు
అలివేణి కొప్పునందు పువ్వల్లు తురిమినదీ
రసరమ్య చూపువెంట భావాల నలమినదీ
మందారపు బుగ్గల్లో సిగ్గుల్లు చిదిమినదీ
పెదవంచు అరుణోదయ కాంతులు నింపినదే
సహజాత పద్మనయన తిలకంబు దిద్దితివే
నగుమోము చూసితేను నగుబాటు పొందనులే
పాపిటిన సింధూరము నేనౌదు సత్వరమూ
నీచెలిమి నివ్వునేను నీయెడల తనివితీరు
నీకట్టు పట్టుచీర విలువంత నాడెందము
నీనగలు పెట్టుకొనే సుందరము నామనసూ
కాపాడ నీశీలం కర్తవ్య కార్తికేయు
జోడించు మనస్సులా విఘ్నముల వినాయకుడ
పార్వతీ పరమేశ్వర ఈప్సితము మనమైత్రీ
రాజిల్లు నీయవ్వన సంపదను రాసివ్వూ
శాసించు నామనసను రాజ్యము రాజరికము
పాలించు నాజీవిత సామ్రాజ్ఞి నీవెయనీ
