నిలిచిపోవాలి
నిలిచిపోవాలి
కోమ్మలు కోయిలమ్మలా పాడాలని ఉంది.
ఇంద్రధనస్సులోని రంగులై మెరవాలనుంది.
ఆకాశంలో నక్షత్రాల వెలుగులు పంచాలి.
పువ్వుల పరిమళమైపోవాలి.
నెమలిలా నాట్యమండాలి.
ఉలి దెబ్బలకు తట్టుకొని శిల్పమై రూపుదిద్దుకోవాలి.
ప్రశాంతంగా ఉండే సముద్రమైపోవాలి.
చిమ్మచీకట్లు చిదిమేసే చిరు దీపమై వెలుగులు పంచాలి.
ఆచేతి గాజులు చేతుల సవ్వడైపోవాలి.
ఉదయించే సూర్యుడి కిరణమవ్వాలి.
రోజులు మరే ఆలోచన ఙ్ఞానమవ్వలి.
అలసిపోని కెరటం కావాలి.
అలుపు లేని పోరాట పటిమనవ్వాలి.
వీరుడి తిలకమవ్వాలి.
అమరవీరులు త్యాగమవ్వాలి.
వీరుల దారిలో నడవాలి.
వారి ఆశల సాధనలో అలుపెరుగని పోరు చేయాలి.
సాహిత్యపు లోకంలో విరబూయాలి.
చెరిగిపోనిఅక్షరమై సజీవంగా నిలచిపోవాలి
చరిత్రకు సాక్ష్యం అక్షరమై నిలవాలి కలకాలం.
