పరిచయం
పరిచయం
నీ కోసం కానప్పుడు..వ్రాయలేను ఒక్క పదము..!
నిన్ను గూర్చి గాకుండా..చేయలేను ఏ ధ్యానము..!
మాటాడక ఎదుటపడక..దొంగాటలు ఆడేవులె..
నీ మౌనపు వెన్నెలింట..ఒకతియ్యని పోరాటము..!
అంతరంగ విశ్వాలకు..రంగడివే కనపడవే..
ఈ పడవను చేరనిమ్ము..పాలకడలి పై గగనము..!
మననడుమన సంభాషణ..నిరంతరము సాగేనా..
నోచుకున్న నీ కరుణకు..ఏదోయీ ఒక రూపము..!
తీరముతో అలలగొడవ..తప్పదులే ఎవరికైన..
ఈమనస్సు కలలపట్టు..తప్పుటయే మనోహరము..!
కౌగిలింట అలరించే..రాగాలకు సెలవెపుడో..
నేను తోలుబొమ్మ సాక్షి..నీవన్నదె గురుపాఠము..

