ప్రగతి
ప్రగతి
మనసుచేసే తమాషాలకు..అంతమెపుడో తెలుసుకోవలె..!
బుద్ధిచెప్పే పాఠమేదో..మనసుపెట్టే నేర్చుకోవలె..!
జన్మజన్మల జ్ఞాపకాలను..దాచిపెట్టుకు చేతువేమిటి..
విశ్వప్రగతికి పనికివచ్చే..జ్ఞానమేదో అందుకోవలె..!
వెక్కిరించే కాలగర్భపు..గంధమేదో రాలనిమ్మోయ్..
బద్ధకాలకు స్వస్థిచెప్పే..శ్వాసవెలుగే పట్టుకోవలె..!
శాంతిమంత్రం వల్లెవేస్తూ..యుద్ధతంత్రము లెందుకంటా..
విశ్వశాంతిని అభిలషిస్తే..స్నేహవనమే పెంచుకోవలె..!
చైత్రరాగం ఆలపించే..కోకిలున్నది గుండెచాటున..
కోటితీర్థపు రాశి హృదయం..ప్రణయగగనం చేరుకోవలె..!
జగములేలే ..కూడియుండే తీరికేదోయ్..
చిలుక రివ్వున ఎగిరిపోయే..లోపుగానే చేసుకోవలె..!
