ప్రేమలేఖ
ప్రేమలేఖ
ప్రేమలేఖ
(వచనకవిత )
ప్రేమలేఖ వ్రాయనా!ప్రియతమా!నిను వలచి
నా మదిని తెలుపనా! నా ప్రేయసివని తలచి
నీ పాదాల సవ్వడికై నే నెదురు చూస్తున్నా!
నీ వలపు పిలుపుకై నే తపన పడుతున్నా!
నీ సిగలో మల్లెనై నే నొదిగిపోతాలే!
నీ సింధూరమునై నే వెలిగి పోతాలే!
నీ ముక్కెర తళుకులో నే జిలుగునౌతాలే!
నీ మందహాసంలో నే వెన్నెలనౌతాలే!
నీ పద మంజీరమునై నే మురిసిపోతాలే!
నీ ప్రణయపు ఝరిలో నే మునకలేస్తాలే!
వీణానాదమై నీ పలుకు వీనులకు వినబడితే
ప్రాణసఖీ!యనుకుంటూ పరవశంతో నే చేరితే
మనసులు కలిసిపోవు మార్గంలో పయనిద్దాం!
మునుపెన్నడు లేని మురిపాలు చవిచూద్దాం!
సరాగాల వనంలో సరదాగా విహరిద్దాం!
మరోప్రపంచంలో మనసుతీర గడిపేద్దాం!
వస్తావా!ప్రియతమా!పరువెత్తి నా కోసం!
చూస్తాలే!నువ్వొచ్చే శుభఘడియల కోసం!//