STORYMIRROR

Jyothi Muvvala

Fantasy Others

4  

Jyothi Muvvala

Fantasy Others

ప్రేమలేఖ

ప్రేమలేఖ

1 min
396

ప్రియతమా ..... 

మదిలో నా రూపం పదిలమేగా

నీకై రోజు వేచి చూస్తున్న

చూసి చూసి అలసినా కళ్ళలో

కన్నీటి ధార వరదై

మసక బారిన అక్షరాలతో 

రాయలేక రాస్తున్నా...


నీ మదిలోని భావన 

నీతో ఉన్న సమయాన

నీ కనుల భాషతో తెలిసే

నీ కొంటె నవ్వు రమ్మని పిలిచినట్టు 

నీ బుంగ మూతి చూసి

అలిగిన నీ మనసే తెలిసేది!


విధి నిర్వహణ అంటూ 

కంటికి కానరాని దూరంగా

ఒంటరిని చేసి వెళ్ళిపోయావు 

తెలిసేనా ఏమైనా...!?

విడలేని ఎడబాటులో

తప్పదీ వేదన!


నీ తలపులోనే మురిసి 

మదిలోనే కొలిచి

వేచి వేచి నీ రాకకై వేచి చూస్తున్న

నాపై నీకున్న ప్రేమ కాస్తయినా 

బ్రతికుంటే పంపలేవా చిరు సందేశాన్ని 

నా సందేహం తీర్చగా......!!

                        ✍️ జ్యోతి.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy