ప్రేమ
ప్రేమ
పెదవులు దాటని తియ్యని మాటల ఊటయె ప్రేమ..!
కవితకు అందని గంధపు తరగల జాడయె ప్రేమ..!
కాలపు కడలిని రంగుల మయమే చేయును చూడు..
పొంగే వలపుల యేఱులు దాచిన వాడయె ప్రేమ..!
జగతిని నడిపే సహనపు నిధియై ఉన్నది లోన..
అంతట అన్నిట వెలిగే దీపపు పాటయె ప్రేమ..!
చెరగని తరగని కలలకు రూపం ఇచ్చును తాను..
అమాయకత్వపు దారిగ మారిన గీతయె ప్రేమ..!
పడగలు విప్పిన బొమ్మల నవ్వులు గమనించేను..
తాపం మోహం రాల్చే చక్కని జాణయె ప్రేమ..!
జిలకర బెల్లపు పట్టున మనుగడ సారము తెలుపు..
మంత్రముగ్దులను చేసే పెండిలి పంటయె ప్రేమ..!