ప్రేమ జీవి
ప్రేమ జీవి
ప౹౹
ఏమాయెను ప్రేమలోని బాసలే ఏమాయెను
ఏమి మాయో ఎదనుండి వెలికి రాదాయెను |2|
చ||
లక్ష ఊసులూ లక్షణంగ పలికి ఆ మౌనమేల
కక్షయే లక్ష్యంగ పలుకులేని మూగ వ్రతమేల |2|
వలపుతో చేసినా ఆ వాగ్దానాలు వల్లించనా
తలుపులోని సుడులనే నీపైనే మళ్ళించనా
|ప|
చ||
అలకలోని కులుకుని అలవోకగా చూపించి
పలకని పలుకులతో ఆ ఫలితము లోపించి |2|
ఏదో సాధించానని ఆ ఎడదనే మోసగించకే
అది అంతాను ప్రేమదే నేరమని కోపగించకే |ప|
చ||
స్వాగతమంటూ తలుపు వాకిళ్ళే తెరిచావు
స్వాజన్యంపెంచి మది స్వాధీనతే మరిచావు |2|
కోరికంతను కొండలా చేసి గుండెనే పిండావు
అలుకంతను మాని కొత్తకోరికై మరి పండవా | ప|