పోకిరి మనసు
పోకిరి మనసు
సిగ్గులేని పోకిరోడంటా
కన్నెపిల్ల కొంగులాగాడంటా,
మనసున్న పత్రమే
కొంగుగామారి
రక్షణకవచమై నిలిచేనంటా.
డబ్బున్న అహం
కామపుబుద్ధికి శాపమంటా,
మత్తుచూపులు
ప్రేమను జయించలేవంటా,
అతివ అందం
వలపురాగం పలకదంటా,
వెంటాడే నీహృదయమే
అసుర నివాసమంటా.
ఉన్మాదం తలకెక్కితే
అలజడిరేపే
జైలుజీవితం తప్పదంటా,
తనువును కాదూ
మనసును గెలిచినప్పుడే
జీవితం
అందంగా మారునంటా,
తలపుల లోగిలిలో
అనురాగం ఆత్మీయత నిలిపితే
మనసు సంఘర్షణలో
అమ్మ అక్కా చెల్లి చెలియకు తేడా కనిపించునంటా,
అబలే ఆదిశక్తిగా మారితే
శోకపు విధివ్రాతే కానుకయ్యేనంటా,
ఊహల్లో కాదూ వాస్తవంలో జీవించి
నిన్ను నీవు ఉద్దరించుకోవాలంట
