మధ్యతరగతి జీవితం
మధ్యతరగతి జీవితం
బరువు బాధ్యతలుభుజాన మోస్తాడు.
కంట నీరు కనిపించనియాడు.
ఎన్నో సమస్యలతో సతమతమవుతాడు.
ఇష్టాలను చంపుకుంటాడు.
చిన్న చిన్న ఆనందాలను దూరం చేసుకుంటాడు.
కష్టాలను ఇష్టంగా మోస్తాడు.
మనసులో కొండతా బాధ మోస్తాడు.
సర్దుకుపోతాడు అన్ని విషయాల్లో.
నచ్చిన వస్తువును సైతం తీసుకోడు.
ఆ అర్థ నాదాలు వినబడవు ఎవ్వరికి.
ఆ బాధ కనిపించదు ఏ కంటికి.
మోస్తునే ఉంటారు జీవితాన్ని.
సరుకులు అయిపోయి ఒకటో తారీకు
వస్తుందనే ఆలోచన రానివ్వదు ఏ ఒక్కరికి
కంటి నిండా నిద్ర.
ఆలోచించి ఆలోచించి కంటికి
ఒంటికి మనశాంతి కరువైపోతుంది.
బాధ్యతల నడుమ బంది అయిపోతాడు.
ప్రతిరోజు గడవడం కోసం పెద్ద యుద్దానే చేస్తాడు.
మధ్యతరగతి జీవితం భావోద్వేగపు పోరు.
