పిచ్చి జ్ఞాపకాలకు
పిచ్చి జ్ఞాపకాలకు
ఒక కల కరిగి పోయింది ఒక నవ్వు చెరిగి పోయింది
ఒక తోట ఎండిపోయింది ఒక గుండె మండిపోయింది
ఆకాశం భళ్ళున విరిగిపడింది ఆశల వృక్షం నేలకొరిగింది
జీవనది ఎడారిగా మారింది సముద్రం ఇంకిపోయింది
దేహ బాధలకు మందులున్నాయి కానీ..
డామిట్…హృదయ బాధకు మందేదీ…??
ఆరోజుల్లో….నిద్రలో నుంచి లేచి
కళ్ళు తెరవాలంటే మనస్కరించేది కాదు !
రాత్రంతాకలల జాతరలో నాతో వున్న నువ్వు
ఎక్కడ తప్పిపోతావోననితెగ భయమేసేది !!
హృదయాన్నిఎప్పుడో కొల్లగొట్టావ్ !
ఇప్పుడునీ కివ్వడానికినా దగ్గరేముంది?
భద్రంగా దాచుకున్న ఆకు పచ్చని
జ్ఞాపకాలు తప్ప!!
నీ అడుగుల సవ్వడికి సరిగమలు కుళ్ళుకున్నాయి
నీ మాటల మధురిమలకుఅయస్కాంతం చిన్నబోయింది
నీ బుగ్గల సౌరుకుతుమ్మెదలు రొద పెట్టాయి
నా మొదటి కవిత చదివి నువ్వు సిగ్గు పడిన క్షణం
ఇంకా పచ్చిగానే వుంది..!!
సప్తపదేం ఖర్మసప్త సముద్రాలూదాటుతానన్నావు !
తీరా సమయం వచ్చేసరికిఅడుగు కూడా కదపకపోతివి
నేనేమో కాలం కాని కాలంలోకోయిల కూత కోసం
ఇంకా…ఎదురు చూస్తూనే వున్నాను !!
పెదవులపై నీ లేత నవ్వును చూస్తూ
శతాబ్దాలుబతకాలనుకున్నా…!!
కానీ...నీ పెదాలవిరుపులతో విషాదాన్ని మిగిల్చావు
వసంతంహసించాల్సిన చోటగ్రీష్మ తాపాన్ని రేపావు
ప్రేమ భాషలో సరళాలే గానీపరుషాలు లేవని నీకు తెలీదా ?
గాయం నీకుబాధ నాకుప్రేమలోఇవన్నీ...
మామూలేగా మనకు…!
ప్రేమంటే. ముద్దాడేందుకువాన చినుకు
పడే తపన..!!
నా ఎదురుగా నీవునీ ఎదురుగా నేను
మనిద్దరి మధ్య మౌనంకళ్ళతోనే పలకరింపులు
కళ్ళ భాష కనబడేదిఒక్క ప్రేమ పుస్తకంలోనే మరి..!!
నాకంటూ..ఇష్టాలేముంటాయి ?
నేను నీలో ...కలిసిపోయాక !!
ప్రేమలో....ఇష్టాలే కాదుసర్వమూ
ధారాదత్తమే !!
కళ్ళు నాలుగైనా..చూపొకటేహృదయాలు
రెండైనా..స్పందన ఒకటే
ప్రేమ కూడికలోఒకటి ఒకటి కలిస్తేవచ్చేది...ఒకటే !!
గాయం నీకుబాధ నాకుప్రేమలో
ఇవన్నీ...మామూలేగా మనకు…!
నువ్వు ……గుర్తొచ్చినప్పుడల్లా
చలించే మనసు గడ్డకట్టి పోతుంది
పారే నది కాస్తా …ఎండి పోతుంది !
పచ్చని వసంతం వెలవెల బోతుంది !
మనుషుల్లో...దూరం పెరిగితే
ప్రేమ ఎడారవుతుందేమో ?
నువ్వు నడిచేటప్పుడునీ అడుగుల సడి
శ్రవణానందమేఅయినా…..
నీ పాదాలు….ఎక్కడ కందిపోతాయోననిగుండె ల్లో...
ఒకటే భయం..!!
ఈ హృదయం మీదనువ్వు చేసిన
వలపు సంతకంఇంకా పచ్చి గానే వుంది
ఇప్పుడు అరవై అయితేనేం?ఒకప్పుడు నేనూ ఇరవైనే !!
నీ బుంగ మూతి పెదవుల సిగ్గులు
నీ నవ్వుల సొట్టబుగ్గ సొగసులు
నీ నయగారాలవయ్యారపు నడకలు
ఇవన్నీ పై పై ఆకర్షణలే
నా ప్రేమకు పునాదినీ ఆత్మసౌందర్యం !!
వెన్నెల జలపాతాలుపారిజాత పుష్పాలు
వింజామర వీచికలుఅని ‘ నే ‘ నన లేను !
భావకవిని కాన్నేనుఅబధ్ధమాడలేను
నీ జ్ఞాపకాల దొంతరలోదిక్కుతోచని బాటసారిని !!
*నీ చూపుల బాణం తగిలిఎన్నిసార్లు గాయపడలేదు
అదేంటో కానీ…..ఈ గాయాలకు బాధే లేదు
కరుకుదనం లేనిదివలపు గాయం !!
జ్ఞాపకం ఎప్పుడూ పచ్చిదేఅనుభవమే పండిపోయింది
ఇక రాలాల్సింది జీవితమేనా ?
మధు మాసం వేడెక్కిందివెన్నెలమ్మ కొండెక్కింది
వసంతం వీడ్కోలు చెప్పింది!!
నేనింకాగుర్తున్నానా?అంటావు !
నిన్నసలు మరిచిపోతేగా?
ప్రేమలోమరుపుండదనినీకు తెలీదా?!!
గానమై వచ్చావుకోకిలమ్మకే రాగం నేర్పావు !!
వసంతమై వచ్చావుమధువును ఒలికించావు
వధువుగా మారావు !!
చలమల్ని తవ్వావుఅధరాల్ని తడిపావు
మధురాల్ని అందించావు !!
కళ్ళు తెరిచే లోపేకలగా మిగిలావు
నా చిట్టి గుండెలో….సెగలు రేపావు !!
ఏ కళ్ళు పడ్డాయో...ఏ దిష్టి తగిలిందో కానీ
మన ప్రేమ రుతువుఒట్టిపోయింది…..
ఓటిదైపోయిందాఉట్టి మీద ప్రేమ కుండ !!
ప్రేమంటేఓ కౌగిలిరెండు యుగళ గీతాలు
మూడు ముద్దులు కాదు
అదిలౌకిక వాసనలకు అతీతం
జన్మజన్మలకూ….వీడని బంధమన్నావు’
మరిప్రయాణం మొదలెట్టకుండానే
కన్నీటి కడలిని చేరువచేసిచెప్పా పెట్టకుండావెళ్ళిపోయావు
అల్విదా! అంటూ…నీకిది న్యాయమా చెప్పు..!!

