STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఓ లేఖ

ఓ లేఖ

2 mins
308



   మౌనంగా వస్తావు
మాటాడవు మాటాడ నేరవు రానా వద్దా అంటూ సంశయిస్తావు
ఐనా...స్రవిస్తావు. బుగ్గలపై. చెంపలపై
తడి ముగ్గుల్ని వేస్తావు
     దేవతలైనా .రాక్షసులైనా ..
.మనుషులైనా..
పశుపక్ష్యాదులైనా ..
అనుభవించే. బాధను
వ్యధను మోగని మూవలా. మూగగా వ్యక్తం చేస్తావు. నీ స్వీయ వ్యక్తిత్వాన్ని తెలుపు తావు. అంతరాలు..స్థాయి
భేధాలను పట్టించుకోవు . నీకందరూ సమానులే పసితనమైనా .తరుణప్రాయమైనా వయసుడిగినా ..
.అందరిలో. నీవు కదులు తూనే ఉంటావు సుడులు తిరుగుతూం...టావు
     కనులను కడలిగా
మార్చే నీవు బాధా తప్త హృదయానికి
అద్దమౌతావు .ఆషాఢ మేఘంలా వర్షించే నీవు కళ్ళముందెన్ని
శక్రధనుసుల్ని సృష్టిస్తావు...! ఎన్ని
వర్ణాలుగా విస్ఫోటి స్తావు...!
           కంట నలక పడినా నీవే వస్తావు
మనసు నలిగినా...
కలిగినా నీవే వస్తావు
నీవుంటే బాగుంటుంద నుకునే. వారు నీ ఓదార్పే కోరుకుంటారు
ఎవరూ లేని వాళ్ళు
నీవే తోడనుకుంటారు
            నీవశక్తతను పెంచుతావంటారు శోకమై కుంగదీస్తావం టారు హృదయ భాష వే నీవౌతూ. భావాల్ని
తెలుపుతావు
     నీవుంటే. స్వరం
కంపితమై .గద్గదమై...
కాంభోజి. రాగమై
శివరంజనియై......నీవే
అణచలేని. విషాదాన
నీ రూపు కనబడ నీయ కే. నీవుంటావు
మొయిలును దాగిన నీరులా ...

కనుల నీలాలై..నీవే కలబడ తావు మెలిబడతావు
జడివై. సుడివైసురుగు తావు 
                   అంతశ్శత్రువులాటలో
అలమటిస్తూంటావు
అంతశ్చేతపగా చరిస్తూంటావు ఆత్మ
విమర్శ చేసుకోమం టావు ఒకోసారి అస త్యము ఔతూంటావు
క్రోధంతో కరడుగట్టిన
గుండెలకేం.తెలుసు నీ
విలువ ...!
      నీవేంటో. నీ గాఢత విలువ ఏంటో
మారాము చేసే పిల్లలకు తెలుసు బాధల ఏరులై కళ్ళ
నీటిని కళ్ళలోనే దాచే
కలికికి తెలుసు లోకపు దు:ఖభారాన్ని
తన కవితలో ప్రతిబింబించే కవికి
తెలుసునిజమేనేమో. ....కాక పోతే ..నా అక్షరాలుకన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు. .అని ఎందుకంటాడు 
తిలక్. జ్వలించే ఎదనున్న భగ్న ప్డేమకు తెలుసు దగా
బడిన జీవితాలకు తెలుసు. తప్త హృదయాలకి తెలుసు. 
   కల కంఠి కంట నీవుంటే కరగిపోవురా
సిరులంటారు నిజమా. ..కాటుక కళ్ళ నుండి నీవు కారుతూ..బుగ్గల నుండి. గడ్డం నుండి
చనుకట్టుపైజారుతూ..పైట కొంగునుతడుపు తూ..నీవే.  
      బాష్పమా జాలి గొలిపే లా అరుదుగా వస్తూ ....ఆవిరౌతూ ..కురిసినా...మెరిసినా...నీవే గుండె గుబులు ను. దిగులు ను. దించేదానివి నీవేగా అశ్రువా....!
   అప్రయత్నంగా ప్రత్యక్షమౌతూ....తళ
తళలమెరుస్తూ... నా
ఎడద మెత్తచేస్తూ......
ఆప్తమయ్యే నీవు
సదా నాకు కావాలని
నన్నొదిలి పోవద్దని
నా సున్నితత్వాన్ని
పోనీయొద్దని వేడుకుంటూ .
తలవంచి నమస్ర్క రిస్తూ నిన్నభ్యర్థిం చ నా ....
                        
              


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance