Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

ఓ జ్ఞాపకమే

ఓ జ్ఞాపకమే

1 min
402


మనిషికీ, జ్ఞాపకానికీ మధ్య

ఓ జీవిత కాల దూరం..

కానీ,

మనిషి ఓ జ్ఞాపకంగా మారేందుకు

క్షణమొక్కటి చాలు..


సుదీర్ఘ జీవన ప్రయాణంలో

అల్లుకున్న అనుబంధాలేవీ ఆపలేని చిరునామే..

జ్ఞాపకంగా మారడం..


అనుకుంటాం కానీ ఊపిరి ఉల్లిపొరల్ని..

ఒక్కొక్కటి ఒలుచుకుంటూ పోతే

మిగిలేది శూన్యం కాదు..

అక్కడో లేత జ్ఞాపకం చిగురిస్తుంది..


ఏ అంతానికి అంతముండదు..

ప్రతి జ్ఞాపకం రూపాంతరం చెందిన ఓ అంతమే..


మనిషి ప్రతి రోజూ కొంచం కొంచంగా చస్తుంటాడు..

తనకు తెలియకుండానే కొన్ని జ్ఞాపకాల్ని ప్రసవిస్తుంటాడు..


చివరి క్షణం మరణాన్ని ముద్దాడినప్పుడు..

మనిషి అమాంతం ఓ శాశ్వత జ్ఞాపకంగా అవతరిస్తాడు..


జ్ఞాపకంగా మిగలని జీవితం 

చీకటి పొరల్లో పాతరేసిన ఉదయం..           

మనిషంటే ఓ జ్ఞాపకమే..

కాలం పెట్టెలో

పట్టెడు జ్ఞాపకాల్ని దాచిపెట్టని మనిషి..

పుట్టినా పుట్టనట్టే..

చావక ముందు చచ్చినట్టే..!


          


Rate this content
Log in

Similar telugu poem from Classics