స్నేహ బంధం
స్నేహ బంధం


స్నేహమంటే ఏమిటో చెప్పాలనుకున్నా,
అనుభూతులతో పుస్తకమే వ్రాయాలనుకున్నా.
బడిబాట ప్రయాణమే కాదూ స్నేహం
మనసు సదా పల్లవించు
మధురభావమే స్నేహం,
కొంటెతనం సొంతమైన
రెప్పలసడి ఆనందరాగమే స్నేహం,
పదములకందని మధురభావాల శ్వాసలద్వారమే స్నేహం,
అక్షరజ్ఞానాన్ని పంచుతూ
బ్రతుకు పాఠాలు నేర్పుతూ నిత్య క్రీయశీల సన్ని'హిత'త్వమేగా స్నేహం.
వెర్రితనాన్ని మందలిస్తూ
అనురాగామృతాన్ని పంచుతూ మనసునేలేటి మధువేగా స్నేహం,
అమ్మ లాలన నాన్న పాలన
అన్నాచెల్లి ఆలంబనా కలగొలుపేగా స్నేహం,
గొడవపడినా గోడుచెప్పినా
పరిమళించు చెలిమిమనసేగా స్నేహం,
తనువు సమాధి అయినా
తలపుసమాధి కానిదేగా స్నేహం,
చెలిమికన్నా విలువైన సంపద
అవనిలో లేదనేదే స్నేహం.
అందుకే
స్నేహపు రహదారుల్లో సదా పయనిద్దాము,
స్నేహాన్నే జీవశ్వాసగా చేసుకుందాము