నిను దల్చి
నిను దల్చి
నినుతల్చి...
(ద్విరదగతి రగడ )
నిను తల్చి నిను పిల్చి నీరూపమే వలచి
కనుదోయి మూయకే కలలోన నే నిలిచి
హృదయపు కోవెలలో నింపుగా నిల్పితిని
మధురంపు రాగాల మమతతో కొల్చితిని
రావోయి!మాధవా!రాగాలు పలికించు!
భావగీతికలతో పరవాలు చిలికించు!
నీదాననై మురిసి నీ వెంట చరియించి
మోదమున హాయిగా ముచ్చటగ విహరించి
నిదురింతు నో సఖా!నే జగమునే మరతు!
వదలనోయీ కరము!ప్రపంచమునే విడుతు!//

