నీవు నేను
నీవు నేను
పంఒబడే ప్రేమ సాక్షి పక్షులమే..నీవు నేను..!
నిత్యస్నేహ పరిమళాల పూవులమే..నీవు నేను..!
ఏకత్వపు కోవెలలో జీవులన్ని దీపాలే..!
కలహంసల గగనంలో మెరుపులమే నీవు నేను..!
పరుగులిడే మబ్బులలో చినుకుపూల సుధలెన్నో..!?
చరితామృత వేదాలకు పదములమే..నీవు నేను..!
కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోంది కణకణమున..!
రుధిర వీణ స్వర ధారకు తంత్రులమే..నీవు నేను..!
కనిపించని ప్రణయ వేణు రవములలో మునకలులే..!
ఏకాంతపు పరువాలకు జలధులమే..నీవు నేను..!

