నీవైపోయా...
నీవైపోయా...
నీ మౌనాన్ని చేధించి బాధిస్తున్నానా
నిన్నాకర్షించాలని ప్రయత్నించి వేధిస్తున్నానా
నీ బాధ్యతలకు అడ్డు పడుతున్నానా
నీ సమయం వృధా చేస్తున్నానా
నిన్ను నిన్నుగా ఉండనిస్తేనేగా నా ప్రేమకు అర్థం
నీ స్వేచ్ఛను నీకిస్తేనేగా నా జన్మకు పరమార్ధం
నీ తలపులలో నేనుంటే మాత్రం నా బ్రతుకు ధన్యం
నీవైపోయా నేనంటూ లేనంతగా ఇది మాత్రం సత్యం....
... సిరి ✍️

