నీతి సుధ
నీతి సుధ
ॐॐॐ
🍁🦚🍁
తేటగీతి..
శత్రువౌను నీ మనసుయె శాంతి వీగి
పోవు నటులనీ దుకరుణ పోయి ఎండి
పోదు వుకదవినుమయా నీ మోము గనుము,
మిత్రులున్నను చాలును మేలుకలుగు!! 1
తల్లి దండ్రులు మిత్రులు తనయు లెల్ల
మంచి చేయు వారు కడకు మనకు మిగులు
తోటి వారి ప్రేమను గుర్తు తో నెఱుగుమ
వినుర శత్రువులు వలదు వేదమిదియె!! 2
కలుపు గోలు తనము పసిడి ఘనము మనకు
నిరుగు పొరుగువారయా యింటి వారు
కూలి పనివారిని గనుమ కొద్ది కరుణ
పొందు లాభమ్ము సత్యమ్ము! పోరు వలదు !! 3
✍️చావలి బాలకృష్ణవేణి
18..1..'23
స్వీయరచన..
