నీ రూపం
నీ రూపం
నీ రూపం నాకెప్పుడూ
అపురూపమే......
నీ ధ్యానం నాకెల్లప్పుడూ పరమాతిశయమే......
గుండె గూటిలో నీ జ్ఞాపకాలలో ముసుగేసిన
నా సిగ్గుదొంతర్లు దాచిపెట్టుకున్నాను.......
నిన్ను తలవని క్షణం ఏదైనా ఉంది
అంటే అది నా ఊపిరి ఆగిపోయినప్పుడే.......
నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నా
నీ రూపం,నీ జ్ఞాపకాలు
నా హృదయంలో చిరకాలం పదిలమే.....

