నీ జ్ఞాపకాల
నీ జ్ఞాపకాల


నీ జ్ఞాపకాల తూకం ఎంతో తెలుసా
అగ్నిలో నిలబడితే కలిగే వేదన అంత
నీ మౌనం చేసే గాయం లోతు ఎంతో తెలుసా
క్షణ క్షణం ప్రాణం తో ఉండి కన్నీళ్ళతో
మరణాన్ని ఆహ్వానించి అనుభవించేంత
నీ జ్ఞాపకాలు ఒక్కోసారి మదిలో
కోరికల కొలిమిని రాజేస్తాయి
మరోసారి దిగులు పడిన ప్రతిసారి
తల్లిగర్భంలోని వెచ్చదనంలా
అక్కున చేర్చుకుంటాయి
నీ జ్ఞాపకాలు నన్ను దిగంతాలకు
విసిరేసి చోద్యం చూస్తాయి
మరోసారి కలవని భూమ్యాకాశాల
అంచులు కలిసినట్టు
భ్రమింపచేస్తాయి.
నీ జ్ఞాపకాలు ఆలింగనం చేసుకుంటాయి
నీ జ్ఞాపకాలు ఉద్వేగానికి గురిచేస్తాయి
నీ జ్ఞాపకాలు నవ్వుల పూలు పూయిస్తాయి
నీ జ్ఞాపకాలు ఎడారిని వనం చేస్తాయి
ఆత్మకు జన్మల బంధాన్ని గుర్తు చేస్తున్నాయి
నీ జ్ఞాపకాల దొంతరలలో మధుర స్వప్నాల్లో
నిద్రించడం తెలియని ధైర్యాన్ని ఇస్తుంది
నీ జ్ఞాపకాల గగనాన మెరిసే తారలన్ని
మది దోచిన మన ముచ్చట్లే
రాలిపడి మాయమయ్యే తారలన్ని
మన అలకలే
నువ్వుండగా ఈ జ్ఞాపకాలు ఎందుకిలా
నా మదితో దోబూచులాడతాయో కదా
దూరం అంటే మనుషుల మధ్యే అనుకున్నా
ఒక్కోసారి మదికి ఉపిరి సలపని బిగికౌగిలిలో
సైతం వేల యోజనాల దూరం
కానీ ఒక్కోసారి అంతరిక్ష అనంతదూరం కూడా
అందుకునేంత సమీపమేమో పిచ్చి మనసుకి
హృది లోని సడి నీ సొదలే శ్వాసిస్తోంది
శ్వాసల్లో నీ ఊహల ఊపిరి వెచ్చదనం
ధన
ుర్మాస వేకువ లో విడివడని చీకట్ల లో
దీపాల వెలుగులో రంగవల్లికలా
మది లో నీ మధురభావాల ఊగిసలాట
నీ జ్ఞాపకాలే ఓ సరికొత్త సంతోష ప్రపంచం.
నీ జ్ఞాపకాలు ఒక్కోసారి మనసు పై
పడే అగ్గి రవ్వలు
అవే జ్ఞాపకాలు ఆ గాయాలపై
నవనీత లేపనాలు
మనసు గడప దాటి వెళ్ళిపోయాక
ఇక తిరిగి రావనుకున్నా
నీ ఆగమనం తరలి వెళ్లిపోయిన
వసంతాన్ని బతిమాలి వెంటబెట్టుకుని
నా ఎదుట నిలిపింది
నీ ఆగమనం తుషార బిందువుల
అద్భుత దృశ్య కావ్యం
నీ ఉసులు ఓ ఊగిసలాట
నీ ఊసులు ఓ మైమరపు
నీ ఊసులు ఓ మైకం
నీ ఊసులు ఓ మంచువనం
నీ ఊసులు ఓ తలపు వింజామర
నీ ఊసులు చిలిపి ఊహల చిరుజల్లు
కలత నిద్ర ఉందంటే నీ కవ్వింపుల మహిమే
కనులు అలసి సొలసాయంటే నీ నిరీక్షణ తో నే
మనసు లయ తప్పిందంటే అది నీ సాన్నిధ్యంలో నే
మౌనం తీయదనం అద్దుకుంది నీ ఊసుల లో నే
వలపు కొత్త అర్థం తెలుసుకుంది నీ కౌగిలి లో నే
ప్రాణం నిలబడుతుంది నీ శ్వాస తో నే
నీ శ్వాసే ఆగిన నాడు నా ఊపిరి కి కూడా ముగింపే
నీ ఊసే లేని నాడు ఈ లోకం నాకు నిర్జీవమే
నేనున్న నేలమ్మ పై నువ్వున్నంత వరకే ఇదో బృందావనం
నువ్వే లేని నాడు ఈ ప్రపంచం ఓ స్మశానమే
నువ్వుంటే ఆకురాల్చు శిశిరాలు కూడా వసంతాలే
నువ్వే లేకుంటే వసంతాలు కూడా మోడు వారులే
కొన్ని కోల్పోతే కానీ విలువ తెలుసుకోలేము
కొన్ని కోల్పోతే తిరిగి పొందలేము
ఆ కోల్పోవడం ఎంత మూల్యానికో@శ్ర