నేస్తమా
నేస్తమా
సామర్థ్యపు లోతులలో..చేరాలిక నేస్తమా..!
మది కోవెల దీపాలే..వెలగాలిక నేస్తమా..!
వాస్తవమున జీవించే..కళ నేర్పాలా ఒకరు..
నీ లోపలి కణకణమున..చూడాలిక నేస్తమా..!
ఏ ప్రధాన మంత్రి వచ్చి..ఆరోగ్యం ఇచ్చేరు..
ఉచితాలకు ఎగబడుటే..మానాలిక నేస్తమా..!
నీతులన్ని నేతిబీర..నేతిసమం చూడకో..
విచక్షణకు చోటివ్వగ..ఆగాలిక నేస్తమా..!
మధుశాలకు దారివెతుకు..ఉద్యోగం ఎందుకట..
స్వచ్ఛమైన శాంతిమధువు..గ్రోలాలిక నేస్తమా..!
అమృతకలశ మింకెక్కడ..అంతరంగమే గాక..
ప్రేమకెంత బలముందో..తెలియాలిక నేస్తమా..!