నేస్తాం...
నేస్తాం...
నీలాల మేఘం......... పలికింది రాగం...........
సరికొత్త ఉదయం.......గడిపేయ్ కాస్త సమయం.......
వెన్నెల్లో సాయంత్రం...... చిరుగాలుల మంత్రం.........
నల్లని రేతిరంతా చల్లని హాయి సంద్రం.............
గడిచే కాలమంతా నీకే కదా సొంతం.............
కురిసే చినుకులన్నీ దోసిట్లో పట్టుకో నేస్తం............
విరిసే మల్లె తీగల్లో చల్లేయ్ స్నేహ సుగంధం............
కొలనులోని కలువల్లా పూసే కలలు సైతం..............
ఒక్కో క్షణం భంగురమై సాగే మన జీవితం.............
విలువే పెంచు జ్ఞాపకమై మిగిలుంటుంది నీ కోసం.....
నిశ్శబ్దమైన మాట్లాడుతుంది నువ్వు నమ్మితే హృదయమా...............

