నేను నీకు నీడగా...
నేను నీకు నీడగా...
నీవంటూ నా తోడుగా లేకుంటే
నడిచే గమనం ఒక ప్రశ్నార్థకమే
చేరే గమ్యం ఆశ్చర్యమే
నడిచే దారంతా అయోమయమే
గడిచే బ్రతుకంతా అగమ్యగోచరమే
నువ్వే నా తోడుగా ఉంటే
మనసంతా కురిసే మంచుపూల జల్లు
సుతారంగా మేనిని తాకే వాసంత సమీరాలు
పెదవులపై ఎప్పటికీ వాడని చిరునవ్వుల సిరిమల్లెలు
వేయి జన్మలకైనా వీడని బంధమే మనదని
నీవు నాకు తోడుగా
నేను నీకు నీడగా
కలకాలం సాగనీ ఇలా...
... సిరి ✍️