నడక
నడక
*నడక*
( బాల పంచపదులు )
ఉషోదయాన నడిచే నడక
హృదయానికి బలమిచ్చే నడక
ఉత్తేజమును నింపే నడక
ఉత్సాహాన్ని కలిగించు నడక
ప్రతి దినమూ నడవాలి విజయ.
నడక మనకిచ్చు నారోగ్యము
నరనరాల్లో నిండును చైతన్యము
పరుగిడు చుండు శక్తి ప్రసారము
నిత్య నూతనమౌ జీవితము
ప్రతి దినమూ నడవాలి విజయ
కాక పిక కూజిత నాదము
కమనీయమౌ ప్రభాత దర్శనము
పత్రపుష్ప భరిత వన వీక్షణము
సూర్య దేవునికి సల్పి వందనము
ప్రతి దినమూ నడవాలి విజయ.
యాంత్రికమౌ పరుగులో జీవనము
సాగుచుండగా కల్గు నీరసము
నడక పోగొట్టును రోగ భయము
దేహ మానసిక శాంతికి మార్గము
ప్రతి దినమూ నడవాలి విజయ.
**************
