నాటు నాటు
నాటు నాటు
నాటు నాటు
తెలుగు పాటకు దక్కిన గౌరవం
విశ్వవిజేతగా నిలిపిన పురస్కారం
నాటు నాటు మన తెలుగు గీతం
ఘాటు పరిమళం విన్యాస భరితం.
ఉరకలు వేసే నవయవ్వన తారాగణం
కరపద నాట్య లయాన్విత తాండవం
వీక్షకులకు కలిగించ మనోల్లాసం
ధరణిలో వెలిగె మన జాతి ధీమత్వం.
అద్భుతమైనదీ చిత్రీకరణ దృశ్యం
భేషైన రాజమౌళి ప్రతిభాపాటవం
ఆంధ్రవాణి కీరవాణి సంగీతావిష్కరణం
చంద్రబోసు కవితా ఝరీ ప్రవాహం
నూతన యువగాయక కంఠ గాంభీర్యం
సర్వజ్ఞతను చాటిన తాళ వాద్య సంయోగం
సర్వ జన సమ్మోహనా భరిత సమ్మేళనం
కఠోరపరిశ్రమకు ఫలితమీ నాద సరాగం
కమనీయ కళా ప్రపూర్ణకలిత మకరందం
దిగంతాలకు వరకూ సత్కీర్తి వ్యాపితం
జగత్తును కదిలించే నాయకత్వ లక్షణం
జోహారు పలుకగా యావత్తు ప్రపంచం
గర్వంగా నిలబడింది భారత దేశం
ఆస్కారు వేదికగా సృష్టించిన ప్రభంజనం
కరతాళ ధ్వనులతో మార్మ్రోగిన సభా ప్రాంగణం
మరిచిపోలేని మధురమైనదీ క్షణం
తరతరములు నిలిచి పోవునీ విజయం
జాతి వివక్షకెదురొడ్డిన తెలుగు తేజం
భరత మాత గళములో మెరిసిన మణిహారం
భవిష్యత్తరములకు స్ఫూర్తివంతం
చిత్రనిర్మాణ సారథులకివే మా వందనం //
