నా ఊహాలోకం...
నా ఊహాలోకం...
ఓయ్ నా అందాల చందమామ ...
నిన్నే వెతికే కనులకు ఎలా చెప్పను
నువ్వు తనలోని మధుర స్వప్నాలలోనే
ఉన్నావని ....
నీ పేరునే కలవరించే హృదయానికి ఎలా చెప్పను నువ్వు తనలో ప్రతిరూపంగా ఉన్నావని ....
నిన్నే ధ్యానించే మనసుకు ఎలా చెప్పను
నీ తలపులతో నిండి నువ్వు తనలోనే ఉన్నావని ....
నీకోసమే తపించే నా ఊహాలోకానికి ఎలా చెప్పను నువ్వు తనలో పుష్పానివై
నను కమ్మని ఆశలతో అల్లుకుని ఉన్నావని ....
ఎలా చెప్పనూ ....

