నా స్నేహం
నా స్నేహం
నీకలలన్నీ ఒడిసిపట్టుంచా...
నాచిరునవ్వులతో తిరిగిద్దామని...
కరిగాయని...ఒలికాయని...
చింతించకు...
నీమోముపై చిరునవ్వు...
ముత్యాలహారంగా...
నీనోట పలికే చిరుపలుకు...
వజ్రాలహారంగా...
నీచెలిమి...
నాకలిమిగా భావిస్తున్నా...
ఆనందంలో పరవశిస్తున్నా...
నాతోడు...
నీకు హాయిగా...
నాస్నేహం...
నీకు ఓదార్పుగా...
ఉంటుందని ఆశిస్తున్నా నేస్తం...
... సిరి ✍️❤️

