నా కలలకు
నా కలలకు
నా కలలకు ప్రతిరూపం..నా ప్రాణము నీవేగా..!
నా పెదవుల మధుగీతం..నా గానము నీవేగా..!
చిత్రమైన చిలిపితనం..తొంగిచూచె నీ కన్నుల..
నా తలపుల నవరాగం..నా మౌనము నీవేగా..!
అందమైన మహోదయం..నీ నవ్వుల ఉషోదయం..
నా ఆశల నవోదయం..నా హృదయము నీవేగా..!
పట్టలేని ఆనందం..పరిమళించె ఎదలోయల..
నా మనసుకు అసలు ధనం..నా భావము నీవేగా..!
నీ చూపుల వయ్యారం..అల్లుకున్న తీవ నేను..
నా వెలుగుకు ఓ మూలం..నా ధ్యానము నీవేగా..!