నా హృదయం...
నా హృదయం...
నన్ను నాకే కొత్తగ చూపించావే...
ఈ వింతే నాకు మత్తుగ తోచిందే...
నన్నే నీలో కలిపేసావే...
నేనంటూ విడిగా లేనేలేనా...
మొత్తంగా నీవై పోయానా...
నా కళ్ళలో వెలుగే నీవే...
నా గళములో స్వరమయ్యావే...
ఆ స్వరములో సరిగమే నీవే...
నా హృదయమే కోవెలై వెలసేనే...
దానిలో నీప్రేమ ప్రతిరూపమే నిండేనే...
నా అణువు అణువు నీకొరకేలే...
నీ రూపమే కనరాదే...
కలల అలలో జ్ఞాపకంగా మిగిలావే...
మౌనమే భాషగా మారావే....
మంచుతెరలో మల్లియవే నీవే...
అంతరంగ మందు తలపులన్నీ నీవే...
అరవిరిసిన మందారమై నీకై వేచున్నానే...
... సిరి ✍️❤️

