నా అక్షరాలు
నా అక్షరాలు
నా అక్షరాలు పగడపు రాశులు
నా పదాలు పారిజాత కన్యలు
నా భావాలు స్వేచ్ఛ వాయువులు
నా మనసు బృందావన విహారాలు
నా పల్లవులు పంచదార చిలకలు
నా కవితా మాలలు...
జాజుల జావళీలు విరజాజుల విరహలు,
నిశ్శబ్దపు నిరసనలు నిశిధీ నీరవాలు,
మనసున మరుమల్లెలు మౌన సరాగాలు,
ముత్యాల రాశులు మురిపాల మువ్వలు,
మువ్వన్నెల వర్ణాలు పంచ రంగుల రంగేళీలు
కలిసి... ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛ విహారాలు...
