మనసెందుకు
మనసెందుకు
హాయి దొరుకు గదివేపే..వెళ్ళలేని మనసెందుకు..!?
కన్నులింటి మధువేదో..పట్టలేని మనసెందుకు..!?
ఎవరు భార్య ఎవరు భర్త..ఎవరికెవరు తోడంటా..
బంధాలకు అతీతముగ..బ్రతకలేని మనసెందుకు..!?
మాయమయే ప్రపంచమే..నిజమేలే ఉన్నంతలొ..
మాయపట్టు సాక్షిగాను..ఉండలేని మనసెందుకు..!?
పూవులాగొ పండులాగొ..రాలిపోవు నాతనువే..
గొడవపడే సంగతులను..వదలలేని మనసెందుకు..!?
పాఠమేమి చెప్పాలట..అనుభవాలె గురువులుగా..
ఆనందపు లోగిలిలో..నిలువలేని మనసెందుకు..!?
నిదానమది బహుమతిగా..ఇవ్వలేరు ఇంకెవరో..
అవగాహనతో స్నేహం..చేయలేని మనసెందుకు..!?

