మిగిలేనులే
మిగిలేనులే
నవరాగమే చెలిఊహలో..సరసాగ్నిగా మిగిలేనులే..!
మధుమాసమే సఖిచూపులో..ప్రణయాగ్నిగా మిగిలేనులే..!
కలహించినా ఒకవేడుకే..కలనైననూ బహుచిత్రమే..
ప్రియమోహమే రగిలించగా..విరహాగ్నిగా మిగిలేనులే..!
మరుమల్లెలే తననవ్వులో..వికసించెనా నిశినీడలో..
శుభతాళమే కరుణించగా.. మదనాగ్నిగా మిగిలేనులే..!
గజలామృతం ప్రభవించగా..తపమెంతయో జరగాలహో..
నిజమౌనమే ప్రవహించగా..పరమాగ్నిగా మిగిలేనులే..!
జగమేలగా తిరుమంత్రమే..వినిపించగా పనిచేయగా..
గురుమార్గమే లభియించులే..హృదయాగ్నిగా మిగిలేనులే..!
చిరుగాలియే ఎదలోయలో..పులకింతలే కలిగించెనా..
చెలిహాసమే శివమోహినీ..చరణాగ్నిగా మిగిలేనులే..!
ప్రియమాధవా గజలన్నదే..ఒకవిందుగా కనుగొంటివా..
నిజశాంతమే వెలిగేనులే..ప్రణవాగ్నిగా మిగిలేనులే..!

