మేలుకో...
మేలుకో...
నీ పేరు వింటే అరవిచ్చే అధరాలు సంపాదించు
నువు దూరమైతే చెమర్చే నయనాలు సంపాదించు
ఈ ధరపై అన్నిటికీ ఇవాళ ధరకడుతున్నారు.
ఏదైనా అమ్మలేనిదీ కొనలేనిదీ సంపాదించు.
అడగకపోయినా జీవితం బోలెడంత బాధనిస్తుంది.
గొడవపడైనా నువ్వే కాస్త సంతోషాన్ని సంపాదించు
అనుకోకుండా నీకే ఒక నిధిలా దొరుకుతాయి.
మదిపుస్తకంలో దాచుకునేందుకు నెమలీకలు సంపాదించు
మహారాజప్రాసాదము కూడా విడిచి వెళ్ళవలసిందే..
ఎవరి గుండెల్లోనైనా కొంత చోటు సంపాదించు
.ఇంతకు మించిన మాయావలయం ఏముంటుంది.
ఖర్చుపెట్టు సంపాదించు ఖర్చుపెట్టు సంపాదించు
ఎలా ఉన్నావని అడిగే వాళ్ళకు కొదువ లేదు.
... సిరి ✍️❤️